రోజురోజుకి పెరిగిపోతున్నఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు.. స్పందించని కెసిఆర్.. ఆగ్రహంలో జేఏసీ సభ్యలు

Related image

నరేశ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోకి చెందిన నరేశ్ అనే డ్రైవర్ బుధవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దిగి రాకపోవడంతో ఇప్పటికే కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్ది.. కార్మికుల్లో ఆందోళన మరింత తీవ్రతరం అవుతోంది.దీంతో వారు ఆత్మహత్యల దిశగా ఆలోచిస్తుండటంపై విచారం వ్యక్తమవుతోంది.

Image result for rtc kcr

ఇదిలా ఉంటే,ఆర్టీసీ సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకుని చెప్పాల్సిందిగా అడ్వకేట్ జనరల్‌కి సూచించింది. ఇరు వర్గాలు మెట్టు దిగని నేపథ్యంలో కనీసం సుప్రీం మాజీ న్యాయమూర్తుల కమిటీ సూచనలకైనా 0.01శాతం స్పందన వస్తుందేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *