మందు బాబులకు శుభవార్త!ఇక సూపర్ మార్కెట్లులో దొరకనున్న మద్యం..

 

పబ్స్ ఓపెన్ చేసే ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విజయన్ తెలిపారు. అంతేకాదు మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు వీలుగా మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

Image result for alcohol

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేరళలో మద్యం సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని అన్నారు. అంతేకాదు పబ్‌లను ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తానని ప్రకటించారు. ముఖ్యంగా వారాంతంలో ఆటవిడుపుగా ఉండేలా పబ్‌లను ప్రారంభించే యోచన ఉన్నట్లు ఆయన తెలిపారు.

Related image

 

కేరళ బెవెరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులలో మార్పులు తెస్తామని వైన్ షాపుల ముందు ప్రజలు బారులుతీరి నిలబడకుండా సూపర్ మార్కెట్ తరహాలో వైన్ షాపులను నెలకొల్పుతామని అన్నారు.  తద్వారా మందుబాబు తమకు నచ్చిన మద్యాన్ని ఈ షాపులలో ఎంపిక చేసుకోవచ్చని ఆయన చెప్పారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *