తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త..దక్షిణ మధ్య రైల్వేలో 4103 ఉద్యోగాలు..నోటిఫికేషన్‌

రైల్వే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. మొత్తం 4103 ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ.

South Central Railway Apprentice 2019: ఖాళీల వివరాలివే:

మొత్తం ఖాళీలు- 4103

ఫిట్టర్- 1460
ఎలక్ట్రీషియన్- 871
డీజిల్ మెకానిక్- 640

వెల్డర్-597

ఏసీ మెకానిక్- 249
ఎలక్ట్రానిక్ మెకానిక్- 102
మెకానిస్ట్- 74
పెయింటర్- 40
ఎంఎండబ్ల్యూ- 34
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18
కార్పెంటర్- 16
ఎంఎంటీఎం- 12

South Central Railway Apprentice 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 8 రాత్రి 11.30 గంటలు
విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
ఫీజు- రూ.100
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు.

South Central Railway Apprentice 2019: ఎంపిక చేసేది ఈ యూనిట్లకే…

1. క్యారేజీ వర్క్‌షాప్, లాలాగూడ.
2. ఎస్ & టీ వర్క్‌షాప్, మెట్టుగూడ.
3. డీజిల్ లోకో షెడ్, కాజిపేట్.
4. ఎలక్ట్రిక్ లోకో షెడ్, కాజిపేట్.
5. ఎలక్ట్రిక్ లోకో షెడ్, లాలాగూడ.
6. ఎలక్ట్రికల్ టీఆర్‌డీ, సికింద్రాబాద్.
7. ఎలక్ట్రిక్ మెయింటనెన్స్, లాలాగూడ.
8. సీ & డబ్ల్యూ డిపో, సికింద్రాబాద్ / కాజిపేట్.
9. డీజిల్ లోకో షెడ్, మౌలాలి.
10. మెమూ కార్ షెడ్, మౌలాలి.
11. సీ & డబ్ల్యూ డిపో, కాచిగూడ.
12. వేగన్ వర్క్‌షాప్, గుంటుపల్లి.
13. డీజిల్ లోకో షెడ్, విజయవాడ.
14. ఎలక్ట్రిక్ లోకో షెడ్, విజయవాడ.
15. ఎలక్ట్రికల్ టీఆర్‌డీ, విజయవాడ.
16. ఎలక్ట్రిక్ మెయింటనెన్స్, విజయవాడ.
17. మెమూ కార్ షెడ్, రాజమండ్రి.
18. సీ & డబ్ల్యూ డిపో, విజయవాడ.
19. సీఆర్ఎస్, తిరుపతి.
20. డీజిల్ షెడ్, గుంతకల్.
21. డీజిల్ షెడ్, గుత్తి.
22. సీ & డబ్ల్యూ డిపో, గుంతకల్.
23. సీ & డబ్ల్యూ డిపో, గుత్తి.
24. సీ & డబ్ల్యూ డిపో, తిరుపతి.
25. ఎలక్ట్రికల్ టీఆర్‌డీ, గుంతకల్.
26. సీ & డబ్ల్యూ డిపో, నాందేడ్.
27. సీ & డబ్ల్యూ డిపో, పూర్ణ.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *