పదో తరగతి పాస్ అయితే చాలు…. సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు… వివరాలివే!

 

లెవెల్ 1 పోస్టుకు 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ కావాలి. లెవెల్ 2 పోస్టుకు ఇంటర్ పాస్ కావాలి.రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారి కోసం మరో నోటిఫికేషన్ విడుదలైంది. పలు పోస్టుల భర్తీకి సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. లెవెల్ 1 లో 10 పోస్టులు, లెవెల్ 2 లో 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది సెంట్రల్ రైల్వే. లెవెల్ 1 లోని 10 పోస్టుల్ని ముంబై, భూసావల్, నాగ్‌పూర్, పూణె, సోలాపూర్ డివిజన్లకు 2 చొప్పున కేటాయించింది. స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులివి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 19 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Central Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…
మొత్తం ఖాళీలు- 12
లెవెల్ 1 పోస్టులు- 10
లెవెల్ 2 పోస్టులు- 2
దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 19
విద్యార్హత- లెవెల్ 1 పోస్టుకు 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ కావాలి. లెవెల్ 2 పోస్టుకు ఇంటర్ పాస్ కావాలి. నిమిషానికి 30 పదాల ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్, 25 పదాల హిందీ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్- ప్రెసిడెంట్ స్కౌంట్ / గైడ్ / రోవర్ / రేంజర్ లేదా హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ ఉండాలి. 2014-15 నుంచి గత ఐదేళ్లుగా ‘సర్టిఫికెట్ ఆఫ్ యాక్టీవ్‌నెస్’ ఉండాలి. రెండు జాతీయ స్థాయి లేదా ఆల్ ఇండియన్ రైల్వేస్ స్థాయి, రెండు రాష్ట్రస్థాయి ఈవెంట్లలో పాల్గొనాలి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *