10వ తరగతి విద్యార్థులకు శుభవార్త!ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు… దరఖాస్తు వివరాలు

10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఎక్స్-సర్వీస్‌మెన్ మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.విద్యార్హతలు తక్కువగా ఉన్నా బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త.

Image result for indian bank

ఇండియన్ బ్యాంక్ సబ్ ఆర్డినేట్ కేటగిరీలో సెక్యూరిటీ గార్డ్ కమ్ ప్యూన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 115 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తుకు నవంబర్ 8 చివరి తేదీ. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఇండియన్ బ్యాంక్.

Related image

ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.indianbank.in ఓపెన్ చేసి కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Bank Recruitment 2019: ఖాళీల వివరాలివే… మొత్తం ఖాళీలు-115, ఆంధ్రప్రదేశ్- 11,అస్సాం- 4,ఢిల్లీ- 3, గుజరాత్- 5, కర్నాటక- 2,కేరళ- 10,మహారాష్ట్ర- 8,ఒడిషా- 2,పాండిచ్చెరి- 4,పంజాబ్- 5,తమిళనాడు- 48,తెలంగాణ- 3,ఉత్తరప్రదేశ్- 6,వెస్ట్ బెంగాల్- 4.

 

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *