పదో తరగతి పాస్ అయితే చాలు…. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి వేతనాల వివరాలివే

ఇండియా పోస్ట్ మూడు రకాల పోస్టుల్ని పోస్టుల్ని భర్తీ చేయనుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు విద్యార్హతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.భారత తపాలా శాఖ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో కూడా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 2707, తెలంగాణలో 970 ఖాళీలున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అప్లై చేసే అభ్యర్థులకు అర్హతలు, భర్తీ చేయనున్న పోస్టులు, వేతనాలపై పలు అనుమానాలున్నాయి.

వాటన్నింటికీ నోటిఫికేషన్‌లో సమాధానాలున్నాయి.గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మ్యాథ్స్, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్స్‌తో 10వ తరగతి పాస్ కావాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలో 10వ తరగతి పాసైనవాళ్లు అర్హులు. 10వ తరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారికంటే మొదటి ప్రయత్నంలో పాసైనవారిని ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. అంటే మెరిట్ వారికే ముందు ఉంటుంది. ఇక అభ్యర్థులకు స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. అంటే తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తెలుగు భాష తెలిసి ఉండాలి. 10వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్ ఉండాలి. అభ్యర్థులకు 60 రోజుల వ్యవధి గల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ ఉండాలి.

ఏదైనా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ల నుంచి ఈ సర్టిఫికెట్ పొందినవాళ్లు అర్హులు.ఒకవేళ మెట్రిక్యులేషన్, 12వ తరగతిలో కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ అవసరం లేదు.ఏఏ పోస్టాఫీస్ పరిధిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయో నోటిఫికేషన్‌లో వెల్లడించింది ఇండియా పోస్ట్. ఇక ఈ పోస్టులకు వేతనాల వివరాలు కూడా నోటిఫికేషన్‌లో చూడొచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-BPM పోస్టుకు లెవెల్ 1 ఉద్యోగులకు రూ.12,000, లెవెల్ 2 ఉద్యోగులకు రూ.14,500. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్-ABPM, డాక్ సేవక్ లెవెల్ 1 ఉద్యోగులకు రూ.10,000, లెవెల్ 2 ఉద్యోగులకు రూ.12,000.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *