ఇంటర్ పాస్ అయితే చాలు… ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. జీతం రూ.21,700 పైనే

మెరిట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో చేరే అవకాశం లభించింది. భారత నౌకాదళం మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 2700 మందితో ఆగస్ట్ 2020 బ్యాచ్‌ను నియమించుకోనుంది. ఈ నియామకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది.

ఇండియన్ నేవీ ఏఏ (సెయిలర్-ఆర్టిఫిషర్ అప్రెంటీస్), ఎస్ఎస్ఆర్ (సెయిలర్-సీనియర్ సెకండరీ) ఖాళీలను భర్తీ చేయబోతోంది. మొత్తం 2700 ఖాళీలున్నాయి. ఇంటర్ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ప్రక్రియ 2019 నవంబర్ 8న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు నవంబర్ 18 చివరి తేదీ. సెయిలర్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Indian Navy Sailor Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 2700
సెయిలర్ (సీనియర్ సెకండరీ)- 2200
సెయిలర్ (ఆర్టిఫిషర్ అప్రెంటీస్)- 500
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 18
స్టైపెండ్- రూ.14,600.
వేతనం- శిక్షణ పూర్తైన తర్వాత వేతనం రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది.
విద్యార్హత- సెయిలర్-సీనియర్ సెకండరీ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో కెమిస్ట్రీ / కంప్యూటర్ / బయాలజీ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాస్ కావాలి. సెయిలర్-ఆర్టిఫిషర్ అప్రెంటీస్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో 12వ తరగతి 60 % మార్కులతో పాస్ కావాలి.

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *