రెగ్యులర్ రొమాన్స్ తో ఇన్ని ఉపయోగాలా..!

రాయల్ ఎడిన్ బర్గ్ పరిశోధకులు అయితే.. తమ పదేళ్ల పరిశోధనల ఫలితంగా రొమాన్స్ లైఫ్ గురించి గొప్ప విషయాన్ని కనుగొన్నామని చెబుతున్నారు.సెక్సువల్ లైఫ్ లో యాక్టివ్ గా ఉండేవారికి దీని ఫలితంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో లాభాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒకటని కాదు… ఎన్నో లాభాలు అంటూ వీరు ఊరిస్తున్నారు.

శృంగార జీవితంలో యాక్టివ్ గా ఉండే దంపతులు… యంగ్ గా కనిపిస్తారని వీరు చెబుతున్నారు. ఎంత యంగ్ గా అంటే.. వీళ్ల వయసు కనీసం ఏడెనిమిదేళ్లు తక్కువ అనిపిస్తుందని ఇక్కడి క్లినికల్ న్యూరో సైకాలజిస్టులు చెబుతున్నారు! ఇక తరచూ రొమాన్స్ లో పాల్గొనే పురుషుడి ఫెర్టిలిటీ రేటు పెరుగుతుందని పరిశోధనలో తేలిందట!

డీహెచ్ఈఏ.. దీన్ని ది యాంటీ ఏజింగ్ హర్మోన్ గా వ్యవహరిస్తారు. శృంగారంలో పాల్గొన్న వేళ శరీరంలో ఇది దండిగా విడుదల అవుతుందని, ఇది శరీరాన్ని ఆవహించడం వల్ల రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.నెలలో ఒకసారి శృంగారంలో పాల్గొనే వారితో, నెలకు మూడు సార్లకు పైగా శృంగారంలో పాల్గొనే వారి ఆరోగ్యాన్ని పోల్చితే.. ఈ రెండో కేటగిరిలోని వారు ఎక్కువ కాలం జీవిస్తారని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకా.. తరచూ శృంగారాన్ని ఆస్వాధించే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది. గాఢమైన శృంగారాసక్తితో అనునిత్యం దాన్ని ఆస్వాధించే వారిలో అపోజిట్ రొమాన్స్ ను ఆకర్షించే శక్తి పెరుగుతుందని మరో పరిశోధన వివరిస్తోంది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *