చిరంజీవిని ఢీకొట్టనున్న ప్రభాస్..!

అల్లు అర్జున్, సమంతా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, విజయ దేవరకొండ. ప్రభాస్, సైరా, సినిమా, సాహో ట్యాగ్…

బాహుబలి’ తరవాత ప్రభాస్‌ నుంచి వస్తున్న సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ రెండు భాగాలూ కలిపి దాదాపుగా రూ.2500 కోట్లు వసూలు చేశాయి. ఈ సినిమాతో ప్రభాస్‌ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించాడు. దాంతో తదుపరి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అందుకే ప్రభాస్‌ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సివచ్చింది. ‘సాహో’ బడ్జెట్‌ రూ.300 నుంచి రూ.350 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్‌ ఇంత అని చిత్రబృందం చెప్పడం లేదు గానీ, ఈ అంకెలకు దగ్గరగానే ఖర్చు చేశారు. బాలీవుడ్‌లో ప్రభాస్‌కి పెరిగిన క్రేజ్‌ కారణంగా అక్కడి హక్కుల రూపేణా మంచి ధరే పలికింది. చాలా ప్రాంతాల్లో సొంతంగా విడుదల చేసుకుంటోంది చిత్రబృందం. లేదంటే ఈ సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ ఇప్పటికే బయటకు వచ్చేసేవి. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ‘సాహో’కి కలిసొచ్చే అంశం.

తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తీయాలన్నది చిరంజీవి ఆశ.. ఆలోచన. దాదాపుగా పదేళ్ల నుంచీ ఈ కల కంటున్నారాయన. అది ఇప్పటికి సాధ్యమైంది. ‘‘ఈ కథని సినిమాగా తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలుసు. నా మార్కెట్‌ కూడా ఆలోచించుకోవాలి. అందుకే ఎప్పటికప్పుడు ఆ ఆలోచన పక్కన పెడుతూనే ఉన్నాను.

‘బాహుబలి’ వచ్చాక, ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు చూశాక నమ్మకం పెరిగింది. అందుకే ‘ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు. అనుకున్న కథని అనుకున్నట్టు తీద్దాం’ అనే నిర్ణయానికొచ్చాం’’ అని ‘ఈనాడు సినిమా’తో చెప్పుకొచ్చారు చిరంజీవి. ‘సైరా నరసింహారెడ్డి’ని పాన్‌ ఇండియా సినిమాగా తీర్చిదిద్ది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘సైరా’ కోసం దాదాపు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. చిరంజీవి కెరీర్‌లో ఇదే అత్యంత ఖరీదైన చిత్రం.

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *