రైల్వే మంత్రి పీయూష్ గోయల్ : ఇక నుండి హైస్పీడ్ రైళ్లతో గంటకు 180 కి.మీల వేగం అందుకుకుంటాం

కీ టాగ్స్: రష్మిక మండన్న, పాయల్ రాజపుత్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, జనసేన, పవన్ కళ్యాణ్,

ఇక గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైలు ఇంజన్ల తయారీకి శ్రీకారం చుట్టామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ప్రయాణికులు తక్కువ సమయంలోనే వారి గమ్యస్థానాలకు సులువుగా చేరుకోవచ్చని మంత్రి గోయల్ వివరించారు.దేశంలో రైళ్ల వేగం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇకపై గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైలు ఇంజన్ల తయారీకి సన్నాహాలు చేశామని ఈ సందర్భంగా పీయూష్ తెలిపారు. భారతీయ రైల్వే ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం మాత్రమే కాదు.

ఇకపై అత్యంత వేగంగా సైతం వారి ప్రయాణం జరిగేలా చర్యలు తీసకుంటుందని గోయల్ తెలిపారు. ప్రయాణికులకు ఇది ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందని మంత్రి గోయల్ వివరించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్స్క్ లో హైస్పీడ్ రైలు ఇంజన్లను ఉత్పత్తి ప్రారంభించామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా హైస్పీడ్ రైలు ఇంజన్ల ఉత్పత్తి చేపట్టామని మంత్రి చెప్పారు.

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *