రోజు ఈ పప్పులు తింటే… పడకపై గుర్రంల పరుగులు తీయచ్చు..!!

ఫాస్ట్‌ఫుడ్, నిద్ర లేమి, వర్క్ టెన్షన్లు ఇలా చాలా. ఐతే… సంతాన భాగ్యం కలగాలంటే నట్స్ తినడం బెస్ట్ రూట్ అంటున్నారు డాక్టర్లు.ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నవి లైంగిక సమస్యలు. పాతికేళ్ల వయసు వాళ్లకు కూడా పెళ్లయ్యాక పిల్లలు కలగట్లేదు. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి.

ఓవైపు జీడిపప్పు, బాదం, ఆక్రోట్లు, కిస్‌మిస్ వంటి గింజలు, పప్పులను రెగ్యులర్‌గా తింటూ ఉంటే స్పెర్మ్ కౌంట్ పెరిగి… పిల్లలు పుట్టే అవకాశాలు మెరుగవుతాయంటున్నారు పరిశోధకులు.

నట్స్ తింటే మంచిదే. బట్ రోజూ ఎన్ని తింటే మంచిది అన్నది చాలా మందికి ఉండే ప్రశ్న. దానికీ సమాధానం దొరికింది.

రోజూ 60 గ్రాముల పప్పులు (బాదం, జీడిపప్పు, ఆక్రోట్లు వంటివి) తింటే… కొన్ని రోజుల్లోనే లైంగిక సామర్ధ్యం బాగా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.

తాజా పరిశోధనకు సంబంధించిన వివరాల్ని న్యూట్రియంట్స్ జర్నల్‌లో రాశారు. నట్స్ రోజూ తింటూ ఉంటే స్పెర్మ్ (శుక్రకణాలు) కౌంట్ పెరగడమే కాదు… వీర్యం నాణ్యత కూడా పెరుగుతుందని తెలిసింది.

నట్స్ తినని వారి కంటే… నట్స్ రోజూ తినేవారికి లైంగిక సామర్ధ్యం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా బాదం, ఆక్రోట్లు తినేవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించాయి.

నట్స్ తింటూనే… రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు కూడా చెయ్యాలని డాక్టర్లు సూచించారు. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 25 ఉంటే పర్వాలేదు. అది అంతకంటే పెరుగుతూ ఉంటే… అది 25కి తగ్గే వరకూ వ్యాయామాలూ చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు. BMI 30 ఉండే వారికి సెక్స్ సామర్ధ్యం తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు.

ఎప్పుడూ హుషారుగా ఉంటూ… నట్స్‌తోపాటూ… పాలు, మాంసం, గుడ్లు, చేపలు తింటూ ఉంటే… కండరాలు పటిష్టం అవుతాయంటున్నారు డాక్టర్లు. ఫలితంగా లైంగిక సామర్ధ్య సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు.

పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటే కూడా సెక్స్‌ సామర్ధ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. ఐతే… జ్యూస్‌లలో షుగర్ కలపకుండా తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు.

పండ్లలో జామకాయ, దానిమ్మను ఎక్కువగా తింటే… అద్భుతమైన లైంగిక సామర్ధ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు డాక్టర్లు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *