హైకోర్టులో వంశి కేసు…రేపో మాపో..

గన్నవరం పోలీసులు తన ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని హైకోర్టును ఆశ్రయించారు. తన మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారని, దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

వంశీ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది. విచారణ సందర్భంగా, కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ వంశీ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వల్లభనేని వంశీ మోహన్ పార్టీ వీడతారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయ్యారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా సమావేశం అయ్యారు. అసలు రాజకీయాల నుంచే తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో పెద్ద దుమారం రేగింది. అయితే, వైసీపీ మీద పోరాటంలో అండగా ఉంటామని చంద్రబాబు స్పందించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ రాజకీయంగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *