ఆ ప్రముఖ డైరెక్టర్ నన్ను మోసం చేసాడు…ఇండస్ట్రీలో అతి పెద్ద కాంట్రవర్సీకి తేరా లేపిన హీరోయిన్ రాశి…

ఆ డైరెక్టర్ నన్ను మోసం చేసాడు…ఇండస్ట్రీలో అతి పెద్ద కాంట్రవర్సీకి తేరా లేపిన హీరోయిన్ రాశి… ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేయాల్సివచ్చిందని చెప్పింది.ఆ సినిమాలో రాశి పాత్ర చాలా నెగిటివ్ గా ఉంటుంది. ఆ సినిమాలో గోపిచంద్ విలన్.. ఆ విలన్ కు లవర్ గా లేడీ విలన్ గా రాశి నటించింది. సెంటిమెంట్, లవ్ పాత్రలతో రాణించిన ఒకనాటి హీరోయిన్..ఇటీవల మళ్లీ తెరపైకి వస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ముదురు భామ ఓ బాంబు పేల్చింది. తనను నిజం సినిమా విషయంలో డైరెక్టర్ తేజ మోసం చేశాడని వివరించింది. కాకపోతే.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పేరు పోగొట్టుకోకూడదని..నెగిటివ్, వల్గర్ షేడ్స్ ఉన్న ఇలాంటి సినిమాను రాశి ఎందుకు చేసిందా అని అప్పట్లో చాలామంది ఆశ్చర్యపోయారు. కాకపోతే.. నటి అన్నాక అన్నీ చేయాలి కదా అనుకుని చేసి ఉంటుందని అనుకున్నారు.కానీ ఆ క్యారెక్టర్ తాను ఎందుకు చేసిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.ఆమె ఏంచెప్పిందంటే.. సాధారణంగా నేను ఎవరి ఆఫీస్‌లకు వెళ్లను. అలాంటిది తేజ పిలిచారని ఆయన ఆఫీస్‌కు వెళ్లా.

‘నిజం’కథ చెప్పి మహేశ్‌బాబు హీరో అన్నారు. ‘గోపీ చంద్‌.. నువ్వు లవర్స్‌. మధ్యలో విలన్‌ వస్తాడు. మొత్తం మీదే లవర్‌స్టోరీ నడుస్తుంది’ అని చెప్పడంతో నేనూ ఒప్పుకొన్నా. షూటింగ్‌ వెళ్లిన తర్వాత ఫస్ట్‌సీన్‌ తీయగానే నాకు అర్థమైపోయింది. దీంతో సినిమా నుంచి తప్పుకొందామని అనుకున్నా.ఇదే విషయాన్ని మా పీఆర్వో బాబూరావుగారికి చెప్పా. ‘మేడమ్‌ మీరు ఇప్పటివరకూ ఏ సినిమా విషయంలో ఇలా చేయలేదు. సడెన్‌గా ఇలా చేస్తే, ఇండస్ట్రీలో బ్యాడ్‌ అవుతారు. ఒప్పుకొన్నారు కదా! ఈసారికి కానిచ్చేయండి’ అన్నారు. మా అన్నయ్య కూడా ‘పోనీలే చెయ్’ అన్నాడు. దీంతో ఒప్పుకోక తప్పలేదు. కానీ, పాత్రకు భిన్నాభిప్రాయాలు వచ్చాయి. కొందరు చాలా బాగా చేశారంటే… మరికొందరు ‘ఎందుకు ఒప్పుకొన్నారు మేడమ్‌’ అన్నారు. నాగబాబుగారు ఫోన్‌ చేసి, ‘నీ పాత్ర నెగిటివ్‌గా ఉన్నా, నువ్వు కత్తిలా ఉన్నావ్‌’అంటూ మెచ్చుకున్నారు అంటూ తన అనుభవాలు పంచుకున్నారు రాశి.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *