ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కి అస్వ‌స్థ‌త‌.. ఆందోళనలో అభిమానులు

ప్రఖ్యాత బాలీవుడ్‌ గాయని లతా మంగేష్కర్‌  (90) స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస ఇబ్బందిగా ఉందని చెప్పడంతో (నవంబర్ 11) సోమవారం తెల్లవారుఝామున ఆమెను ముంబ‌యిలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సీనియర్ వైద్య సలహాదారు డాక్టర్ ఫరోఖ్ ఇ ఉద్వాడియా పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థతితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది.

కాగా లతా మంగేష్కర్‌  సెప్టెంబర్ 28న 90వ పుట్టిన రోజు జరుపుకున్నారు. మరోవైపు అశుతోష్ గోవారికర్ చిత్రం ‘ పానిపట్’ లో గోపికా బాయిగా నటించిన తన మేనకోడలు పద్మిని కోహ్లాపురి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిన్న (నవంబరు 10) లతా  ట్వీట్‌ చేశారు.  ఈ సందర్భంగా పద్మినితోపాటు, చిత్ర యూనిట్‌కు ఆమె శుభాకాంక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *