పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై నోరుజారిన 30 ఇయర్స్ పృథ్వీ..

Image result for 30 ఇయర్స్ పృథ్వీ

చంద్రబాబు చేపట్టబోయే ఇసుక దీక్ష కూడా రాజకీయ లబ్ది కోసమే అని ఆయన విమర్శించారు. ఇసుకపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌లో కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉందని వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆరోపించారు.

Image result for 30 ఇయర్స్ పృథ్వీ

వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని ప్రజలందరికీ తెలుసుని… దీనిపై చంద్రబాబు, పవన్ రాద్ధాంతం చేయటం పద్ధతి కాదని సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ర్యాంప్‌లకు రోడ్లు వేసారు కానీ, గ్రామాల్లో ప్రజల కోసం రోడ్లు వేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Image result for 30 ఇయర్స్ పృథ్వీ

ఇసుక కొరతకు గత ప్రభుత్వమే కారణమని ప్రజలకు తెలుసన్న ఆయనఈ దోపిడీని భరించలేకే ప్రజలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చారని సెటైర్ వేశారు. అయినప్పటికీ ఆ పార్టీ ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని అన్నారు. ఇసుక రీచ్‌లో ఉన్న వాస్తవ పరిస్థితులను పృథ్వీ స్వయంగా పరిశీలించారు.

Image result for 30 ఇయర్స్ పృథ్వీ

నిబంధనలను అతిక్రమించి టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా దోచేశారని అన్నారు. 90 రోజుల నుంచి కృష్ణానది వరద ప్రవహిస్తోందని… వరద తగ్గముఖం పట్టిన వెంటనే ఇసుక కొరత పూర్తిస్థాయిలో తీరుతుందని తెలిపారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *