అలీకి జగన్ షాక్… విజయ చందర్‌కు కీలక పదవి

Related image

విజయ చందర్ … టంగుటూరి ప్రకాశం పంతులు మనవడుగా ప్రఖ్యాత గాయని టంగుటూరి సూర్య కుమారి మేనల్లుడు. అంతేకాదు సినీ పరిశ్రమలో కూడా ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కరుణామయుడు’ సినిమాతో ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వెలుగు వెలిగాడు విజయ్ చందర్.

అలీకి జగన్ షాక్... విజయ చందర్‌కు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి

ఆ తర్వాత ఆయన రాజకీయాలలో కొనసాగుతూ వైఎస్ఆర్ పార్టీకి తనవంతు సేవలను అందిస్తూ వచ్చాడు. విజయ్ చందర్ కు ఈ కీలక పదవి దక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా సినీనటుడు విజయ్ చందర్ ను నియామిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీనికి సంబంధించిన జీవో జారీ చేసి ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అయితే ఈ పదవి తనను వరిస్తుందని అలీ ఎంతగానే ఆశపడ్డారని సమాచారం. అయితే అలీకి షాక్ ఇచ్చిన జగన్ అనూహ్యంగా విజయ్ చందర్‌కు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *