హైకోర్టులోఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వం మధ్య వాడివేడి చర్చలు.. సంచలన నిర్ణయం తీసుకున్నన్యాయస్థానం

Image result for rtc high court

ప్రభుత్వ రంగ సంస్థలపై మాత్రమే ఎస్మా ప్రయోగించగలమని..కానీ ఆర్టీసీ కార్పొరేషన్ అని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఎస్మా పరిధిలోకి రారనే అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది.తెలంగాణ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై మరోసారి కీలక వాదనలు జరిగాయి.

Image result for rtc high court

ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని.. సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదించారు. ఐతే సమ్మె చట్ట విరుద్ధమని తాము చెప్పలేమని హైకోర్టు తెలిపింది.

Image result for rtc high court

సమ్మె విషయంలో ఇప్పటికప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది కోర్టు. తమకూ కొన్ని పరిమితులు ఉన్నాయని.. చట్టాన్ని అతిక్రమించి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ఆర్టీసీ యూనియన్లు, ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించినా.. ఎవరూ ముందుకు రాలేదని వెల్లడించింది హైకోర్టు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *