బుల్‌ బుల్‌ తుఫాన్ బీభత్సం..భారీ వర్షాలతో 20 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలను వణికించిన బుల్‌ బుల్‌ తుఫాన్ బంగ్లాదేశ్‌ తీరం వైపు పయనిస్తోంది. బంగ్లాదేశ్‌ లో తీరం దాటిన ఈ తుపాన్‌ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిశాయి. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కురిసిన భారీ వర్షాలతో మొత్తం 20 మంది మరణించారు. బుల్‌ బుల్‌ తుఫాన్ బీభత్సం వల్ల పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 10 మంది, ఒడిశాలో ఇద్దరు, బంగ్లాదేశ్‌లో 8 మంది మరణించారు.

కోల్‌కతా నగరంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ట్రాఫిక్‌ రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చీఫ్‌ సెక్రటరీ రాజీవ్‌ సిన్హాల కంట్రోల్‌ రూం లో ఉండి తుపాన్‌ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తుఫాన్ బాధితులకు ఆహార పొట్లాలను అందించారు. తుపాన్‌ వల్ల వందలాది గఅహాలు దెబ్బతిన్నాయి.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *