కోడిగుడ్డు పెంకుల పొడితో అన్ని ఉపయోగాలు ఉన్నాయా? అయ్యా బాబోయ్…

కోడిగుడ్డు పెంకుల పొడితో అన్ని ఉపయోగాలు ఉన్నాయా? కోడిగుడ్ల‌లో ఉండే తెల్ల‌ని, ప‌చ్చ‌ని సొనే కాదు. కోడిగుడ్డు పెంకుల‌ను కూడా తిన‌వ‌చ్చ‌ని, అవి కూడా ఎంతో ఆరోగ్యకరం అని వైద్యులు చెబుతున్నారు. వాటిని మ‌న శ‌రీరం సుల‌భంగా జీర్ణం చేసుకోగ‌లుగుతుంద‌ట‌. అయితే వాటిని అలాగే డైరెక్ట్‌గా కాకుండా శుభ్రంగా క‌డిగి నీటిలో మ‌రిగించాలి. 10 నిమిషాల పాటు వాటిని బాగా నీటిలో మ‌రిగించాక ఆ నీటి నుంచి పెంకుల‌ను తీసి ఆర‌నివ్వాలి. అనంత‌రం అవి పొడిగా అయ్యాక మిక్సీలో వేసి పౌడ‌ర్‌లా ప‌ట్టాలి. మిక్సీకి రావ‌నుకుంటే కాఫీ బ్లెండ‌ర్‌ను కూడా వాడ‌వ‌చ్చు. అలా తయారు చేసిన పౌడ‌ర్‌ను నిత్యం అర టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఈ పొడి వల్లనా రోజులో మ‌న‌కు కావ‌ల్సిన కాల్షియంలో దాదాపు 90% వ‌ర‌కు అందుతుంది. ఇది మ‌న ఎముక‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు ఇది ఎంతో అవ‌స‌రం కూడా. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. కోడిగుడ్డు పెంకుల పొడిలో ఉండే కాల్షియం అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన‌ద‌ని వైద్యులు చెబుతున్నారు.

దీన్ని మ‌న శ‌రీరం సులభంగా రిగించుకుంటుంద‌ట‌. దంతాలు, ఎముక‌లు, కండ‌రాలు, న‌రాల‌కు ఈ కాల్షియం ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌ని వారు చెబుతున్నారు. కోడిగుడ్డు పెంకుల పౌడ‌ర్‌లో ఉండే ఔష‌ధ కార‌కాలు బీపీని, ర‌క్తంలోని చెడు కొలెస్ట‌రాల్‌ను త‌గ్గిస్తాయి. ఈ పౌడ‌ర్‌ను ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే ముఖం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది. కోడిగుడ్డు పెంకుల్లో ఉండే కాల్షియం మొక్క‌ల‌కు కూడా అవ‌స‌ర‌మే. ఇంట్లో మొక్క‌ల‌ను ఎక్కువ‌గా పెంచేవారు ఆ పెంకుల్ని ప‌డేయ‌కుండా మొక్క‌ల‌కు ఎరువుగా వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి. ఎగ్ షెల్ పౌడ‌ర్‌ను ఇంట్లో పెంచుకునే కుక్క‌ల‌కు కూడా తినిపించ‌వ‌చ్చ‌ట‌. దీని వ‌ల్ల వాటికి కూడా కాల్షియం బాగా అందుతుంది. అయితే ఈ పౌడ‌ర్‌ను నేరుగా కాకుండా అవి తినే ఆహారంలో క‌లిపితే బాగుంటుంది. కాఫీని మ‌ర‌గ‌బెట్టే స‌మ‌యంలో కొద్దిగా ఎగ్ షెల్ పౌడ‌ర్‌ను క‌లిపితే కాఫీ ఎక్కువ చేదుగా అనిపించ‌ద‌ట‌. దీంతోపాటు ఆ పౌడ‌ర్ ద్వారా మ‌న‌కు ఎలాగూ పోష‌కాలు అందుతాయి కూడా.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *