నిద్రలేమి సమస్య వాళ్ళ ఎన్ని కోట్లు నష్టమో తెలిస్తే ముక్కున వేళ్ళుయేసుకుంటారు..!

నిద్రలేమి సమస్య వాళ్ళ ఎన్ని కోట్లు నష్టమో తెలిస్తే ముక్కున వేళ్ళుయేసుకుంటారు..!  ఏ పనీ సక్రమంగా చేయలేడు. అంతే కదా? కాదండోయ్.. మనిషి నిద్రలేమి బోలెడంత ఆర్థిక నష్టానికి దారితీస్తోందని తేలింది.సరైన నిద్రలేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండలేడు. నిద్రలేమి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.మనిషికి సరిపడా నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది? అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఆరోగ్యంగా లేకపోతే సరిగా పనిచేయలేడు. దీంతో కంపెనీల ఉత్పాదకత తగ్గుతుంది. ఫలితంగా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

రాండ్‌ అనే ఓ సంస్థ 34 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఉద్యోగులపై ఎల్లవేళలా తీవ్రమైన పని ఒత్తిడి ఉంటోందని, అదే ఒత్తిడితో ఇంటికి వెళ్లడం.. అక్కడా పనిచేయడంతో సరిపడా నిద్ర ఉండటంలేదని ఆ సంస్థ వివరించింది. మరుసటి రోజు ఒత్తిడికి అదనంగా నిద్రలేమితో ఆఫీసుకు రావడం వల్ల సరిగా పనిచేయలేకపోతున్నారని పేర్కొంది. దీంతో ఆయా కంపెనీల ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోయి, నష్టాలు వాటిల్లుతున్నాయని వెల్లడించింది. కాగా, నిద్రలేమి కారణంగా ఎక్కువగా నష్టపోతున్న దేశాల్లో అమెరికా ముందు ఉంది. ఏటా దాదాపు41,100 కోట్ల డాలర్లను అగ్రరాజ్యం నష్టపోతున్నట్లు తేలింది. ఇక 13,800 కోట్ల డాలర్ల నష్టంతో జపాన్‌ రెండో స్థానంలో ఉండగా..

తర్వాతి స్థానాల్లో జర్మనీ, యూకే, కెనడా ఉన్నాయి. ఇక ఎక్కువ ఉద్యోగులుండే భారత్,చైనాలో నిద్రలేమితో జరుగుతోన్న నష్టాన్ని ఇప్పటి వరకు ఎవరూ లెక్కించలేదు. నిద్రలేమితో కలుగుతోన్న నష్టాన్ని పూడ్చుకోవడానికి జపాన్‌లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ఉద్యోగులు కాసేపు కునుకు తీయడానికి ఆఫీసుల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *