యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.in ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలు, పలు విభాగాల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 418 ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్, 67 పోస్టులకు ఇంకో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఇప్పుడు 153 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.దరఖాస్తుకు 2019 నవంబర్ 28 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
UPSC Recruitment 2019: ఖాళీల వివరాలివే…
మొత్తం ఖాళీలు- 153
ఎగ్జామినర్- 65
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయో-కెమిస్ట్రీ)- 12
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాలజీ)- 13
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎండోక్రినాలజీ)- 11
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూక్లియర్ మెడిసిన్)- 5
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పల్మనరీ మెడిసిన్)- 9
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పోర్ట్స్ మెడిసిన్)- 1
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ మెడిసిన్)- 2
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ప్యాథాలజీ)- 2
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియో డయాగ్నసిస్)- 14
సీనియర్ లెక్చరర్ (ఇమ్యునో హెమటాలజీ అండ్ బ్లట్ ట్రాన్స్ఫ్యూజన్)- 1

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 28
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 29
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.