పదోతరగతి అమ్మాయితో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. బయటపడ్డ ఫోటోలు,వీడియోలు.. షాక్ లో కెసిఆర్

Image result for trs thatikonda mla rajaiah kcr

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్య జనగాం జిల్లాలోని చేల్పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ భోజనాల సందర్భంగా ఓ పదో తరగతి విద్యార్థిని ఓ ప్లేట్‌లో అన్నం, కూరలు వేసుకుని వచ్చి, వాటిని కలిపి ఎమ్మెల్యేకు గోరుముద్దలు తినిపించింది.

వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. పదో తరగతి అమ్మాయితో గోరుముద్దలు..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ పదో తరగతి అమ్మాయి గోరుముద్దలు పెడుతుంటే.. ఆయన ఎంచక్కా ఫొటోలకు ఫొజులిస్తూ ఆరగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఆ పక్కనే మరో పదో తరగతి అబ్బాయి తాటికొండ రాజయ్య కోసం వాటర్ బాటిల్ పట్టుకుని ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారడంతో తాటికొండ రాజయ్య మీద నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి కదా. ఆయన తినలేరా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై తాటికొండ రాజయ్య స్పందించారు. పాఠశాల ఫంక్షన్‌కు వెళ్లిన తనకు ఆ బాలిక ‘అంకుల్ నేనే మీకు తినిపిస్తాను అంటూ ఆమే గోరుముద్దలు కలిపి పెట్టింది. నేను తరచుగా ఆ స్కూల్‌కి వెళ్తూ ఉంటా. ఆ అమ్మాయి నా కూతురు లాంటిది. అందులో తప్పేముంది. సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని రాజయ్య వివరణ ఇచ్చారు. అయితే, ఎమ్మెల్యేనే పబ్లిసిటీ కోసం తనకు గోరుముద్దలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారని పక్కనున్న వారు చెబుతున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *