ఐదేళ్ల చిన్నారి వర్షిత హత్యకేసులో మరో మలుపు.. బయటపడ్డ సంచలన నిజాలు.. ఆగ్రహంలో జగన్

Image result for 5years varshitha murder

రెండు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లిన ఐదేళ్ల చిన్నారి వర్షితని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా చంపేశారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి.

చిత్తూరులో చిన్నారి వర్షిత హత్యపై జగన్ ఆవేదన

పోలీసులు విచారణలో భాగంగా కళ్యాణమండపంలో సీసీ టీవీ ఫుటేజిని పరిశిలించారు.చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షిత మృతిచెందిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి వర్షిత హత్యపై స్పందించిన జగన్.. హంతకుడ్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను జగన్ ఆదేశించారు.

Image result for 5 years varshita murder

పెళ్లిలో వర్షితను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అనుసరించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించారు పోలీసులు. స్నేహితులతో ఆడుకుంటున్న వర్షితను గమనిస్తూ ఆ వ్యక్తి ఫోటోలు తీసినట్టు తెలుస్తోంది. చిన్నారితో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఎవరో పిలవడంతో కల్యాణ మండపంలోకి వర్షిణి పరుగులు తీసింది.

Image result for 5 years varshita murder

ఆ తర్వాతే వర్షిణి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఊహా చిత్రం విడుదల చేశారు. వర్షిణి తల్లిదండ్రులకు ఎవరితోనైనా ..పాత గొడవలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *