అర్థరాత్రి తీరం దాటనున్న బుల్ బుల్… ఆ ప్రాంతాల వారికి భారీ ముప్పు

బంగ్లాదేశ్‌కు దక్షిణ నైరుతి దిశగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు విశాఖపట్టణం వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘బుల్‌బుల్‌’ తుపానుముంచుకొస్తుంది. తుపానుగా మారిన ‘బుల్‌బుల్’ పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో ఉంది.  పశ్చిమ బెంగాల్‌‌కు దక్షిణ నైరుతి దిశగా 450 కిలోమీటర్లు

ఈ తుపాను నేటి అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌ సాగర్‌ దీవులు, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ఏపీలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *