వైసీపీలో వంశీ… ఎపుడు చేరతారో తెలుసా ?

సీఎం జగన్‌ని కలిసి వచ్చిన తర్వాత వంశీ అనుచరులు నియోజకవర్గంలో పలువురు టీడీపీ నేతలకు ఫోన్లు చేసి రాజీనామాలు చేయాలని కోరారు.పార్టీ మార్పుపై వంశీ తన అనుచరులకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్లు తలలు పట్టుకుంటున్నారు.  దీంతో కొందరు టీడీపీకి రాజీనామా కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో వంశీ తిరిగి సందిగ్ధంలో పడటంతో నియోజకవర్గంలోని వంశీ అనుచరగణంలో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు గన్నవరం వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు వర్గం మాత్రం.. వంశీ వైసీపీలో చేరే అవకాశల్లేవని ప్రచారం చేస్తోంది.
వంశీ రాకపై సీఎం జగన్‌ సానుకూలంగా లేరని వారు ప్రచారం చేస్తున్నారు. వంశీ సీఎం జగన్‌ని కలిసొచ్చిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చాయి.వంశీని పార్టీలో చేర్చుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధిష్ఠానం వంశీని చేర్చుకోవడంపై పునరాలోచనలో పడిందని వెంకట్రావు వర్గం ప్రచారం చేస్తోంది. మరోవైపు వెంకట్రావుకు ఇప్పటికే హైకమాండ్‌ నుంచి ఎటువంటి ఆందోళన చెందవద్దని సందేశం అందినట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో గన్నవరం రాజకీయం మరికొన్ని రోజులపాటు ఉత్కంఠ రేపే అవకాశం కనిపిస్తోంది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *