రోజా గెలుపుకి కారణం మేమె.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

ముద్దుకృష్ణమ నాయుడు మరణానంతరమే అభ్యర్థిని ప్రకటించి ఉంటే నగరి టికెట్‌ను పోగొట్టుకునేవాళ్లం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అయితే ముద్దుకృష్ణమ కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆలస్యం చేయాల్సి వచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు.మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… నగరిలో టీడీపీ ఓటమికి కారణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ విషయంలో తాను మరో ఆలోచించానని చంద్రబాబు అన్నారు.కుటుంసభ్యులు కలస్తారేమో అని తాను భావించానని… అందుకే అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేశానని చంద్రబాబు అన్నారు. కానీ కుటుంబసభ్యులు ఇలా పార్టీ ఓటమికి పనిచేస్తారనుకోలేదని వారి ముందే వ్యాఖ్యానించారు. కుటుంబమంతా కలిసి పని చేసి ఉంటే ప్రత్యర్థి గెలిచేవారు కాదని… పరోక్షంగా రోజా గెలుపును ప్రస్తావించారు.

రాజకీయాల్లో నాయకులుగా ఎదగాలనుకునే వారు శత్రువుల్ని పెంచుకోకూడదని హితవు పలికారు. గాలి ముద్దుకృష్ణమ కుమారుడు భాను కష్టపడితే మంచి నాయకుడిగా ఎదుగుతారని చంద్రబాబు అన్నారు.మాజీ మంత్రి చెంగారెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని… ఆ పని స్థానిక నేతలే చేయాలని చంద్రబాబు వారికి సూచించారు. 2014 ఎన్నికల్లో నగరి నుంచి 858 ఓట్ల మెజార్టీతో గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై గెలిచిన రోజా… 2019లో 2,708 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్‌పై విజయం సాధించారు.

అల్లు అర్జున్, చిరంజీవి, త్రిష, కృష్ణ, విజయ్ దేవరకొండ,ఎన్టీఆర్, కృష్ణ, ప్రభాస్, త్రిష, చంద్రబాబు నాయుడు,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *