బంగాళాఖాతంలో ‘బుల్‌బుల్’ తుఫాను… అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ హెచ్చరిక!

మాంద్యం పడమటి వైపుగా కదిలి.. తూర్పు-మధ్య మరియు ఆగ్నేయ బంగాళాఖాతం అటునుంచి ఉత్తర అండమాన్ లోకి ప్రవేశించింది. బుల్బుల్ తుఫాను నేపథ్యంలో, తూర్పు తీరంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో నవంబర్ 9 నుండి12 మధ్య భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఇది ఒడిశాలోని పారాడిప్‌కు ఆగ్నేయంగా 890 కిలోమీటర్లు అలాగే పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు 980 కిలోమీటర్ల ఆగ్నేయంలో కేంద్రీకృతమై ఉందని ఐఎమ్‌డి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది త్వరలోనే తీవ్ర మాంద్యానికి, బుధవారం తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా తెలిపారు, ఒడిశా తీరంలో తుఫాను తాకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *