యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్3 రన్నరప్.. చిరంజీవితో హాట్ సెల్ఫీ.. ఆశ్చర్యంలో ఇంటి సభ్యలు

Image result for sreemukhi

ఈ షోలో వినోదం ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, టాస్కుల్లో ఫైట్లు కూడా జరుగుతాయి. దీనికి తోడు ఇవన్నీ పండించే వాళ్లు ఊరూపేరు లేనివాళ్లా.. కాదుగా, సెలబ్రిటీలు.టీవీలో ప్రసారమయ్యే రియాలిటీ షోలన్నింటిలోనూ ‘బిగ్ బాస్’ ప్రత్యేకం.

Image result for bigg boss 3 telugu sreemukhi

ఒక ఇల్లు కట్టి.. అందులో అడుగడునా కెమెరాలు ఏర్పాటుచేసి.. ఆ ఇంట్లోకి కొంత మంది కంటెస్టెంట్లను పంపి.. ఇక మీ ఇష్టం అని వదిలేస్తారు. అందుకే, ఈ షో అంటే చాలా మంది పడిచచ్చిపోతారు. కేవలం ఫాలో అవ్వడం మాత్రమే కాదు.. తమకిష్టమైన కంటెస్టెంట్‌కి ఓట్లు తెగ గుద్దేస్తుంటారు.

ఇప్పటికే తెలుగులో రెండు సీజన్లు ముగిశాయి. ఇప్పుడు మూడో సీజన్ కూడా అయిపోయింది. 100 రోజులకు పైగా అభిమానులకు వినోదాన్ని పంచిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి మధ్య చివరి నిమిషం వరకు పోటీ నెలకొంది. అసలు శ్రీముఖినే విన్నర్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు.

Related image

కానీ, చివరికి వచ్చే సరికి రాహుల్ విజేతగా నిలిచాడు. ఇది శ్రీముఖి అభిమానులకు షాక్ ఇచ్చే వార్తే. ఎందుకంటే, ఈ సీజన్‌లో ది బెస్ట్ పెర్ఫార్మర్ ఆమె. ఉదయం నిద్రలేపే పాటకు డ్యాన్స్ చేయడం దగ్గర నుంచి హౌస్‌లో జరిగిన ప్రతి టాస్క్‌లో ఇన్వాల్వ్ అయిన కంటెస్టెంట్ శ్రీముఖి. కానీ, కొన్ని తప్పిదాలు, పరిస్థితులు ఆమెకు టైటిల్‌ను దూరం చేశాయి.

Image result for bigg boss 3 telugu sreemukhi

అయినప్పటికీ రాములమ్మ నిరుత్సాహం చెందలేదు. కాకపోతే ఓడిపోవడం ఎవ్వరికీ ఇష్టముండదని తాను కూడా అంతేనని చెప్పింది శ్రీముఖి. ఓడిపోవడం తన రక్తంలోనే లేదని అన్నది. టైటిల్ గెలవకపోయినా కొన్ని కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నానని చెప్పింది.

Image result for bigg boss 3 telugu sreemukhi

ఫైనల్ వరకు తాను రావడం ఎంతో సంతోషమని.. విజేత కావాలంటే లక్ కూడా ఉండాలని వెల్లడించింది. అయితే, రాహుల్‌కి ట్రోఫీని బహూకరించేటప్పుడు ఒక పక్కకు ఉండిపోయిన శ్రీముఖిని చిరంజీవి పిలిచారు. డల్‌గా ఉండటం తనకు నచ్చలేదని.. తనతో ఒక సెల్ఫీ దిగాలని కోరారు. భుజం చేయివేసుకొని సెల్ఫీ దిగుతావా అని అడిగారు. వెంటనే శ్రీముఖి చిరంజీవి భుజాలపై రెండు చేతుల వేసుకుని హాట్ సెల్ఫీ దిగింది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *