ఫైనల్ గా బిగ్ బాస్ 3 టైటిల్ గెలుచుకున్న రాహుల్…అందరి మనసులను గెలుచుకున్న వరుణ్..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగిసింది. ఈ రోజు జరిగిన ఫైనల్‌లో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయమై ఉత్కంఠ కొనసాగింది. బిగ్‌బాస్ 3 ఫైనల్‌ కోసం పెద్ద పెద్ద హీరోయిన్స్‌తో స్పెషల్ డాన్స్ షోలు ఏర్పాటు చేసింది స్టార్ మా నిర్వాహాకులు. ఇప్పటికే కేథరిన్, అంజలి ఈ షోలో తమ డాన్సులతో ఈ షోకు జోష్ తీసుకొచ్చారు.

View this post on Instagram

Every Journey Is a Marathon And has various Hurdles From Origin to Destination… Every Athlete who participates wants to win the race But only one can Win. Big Boss Journey is a Marathon with lots of Emotions, Tasks and Relations.! 10years ago Varun was known by every college student with Happy Day's.. And his fame was amazing. He Recreated this and is now a huge heartthrob for every common man. His Journey taught him Many things and his every Footstep might be a lesson for many.. The Way he stands for the Truth and Justice are his Strengths. BiggBoss is A Great opportunity utilised by him in a right way to Prove His Nature and His behaviour… He Might Have not Reached The Big Boss Title But He is our Mr cool and our Mr Perfect. 😎 Despite facing many hurdles in the game, he faced it with confidence. He created Many beautiful memories and made strong Relations who will stay with him forever. Every Week has Turned Him strong and Brave. He has sustained in the house only because of the Love and Support he has received from you all… It was an Amazing Journey with you guys… A BIG THANK YOU TO EACH AND EVERYONE ❤ Signing Off ~ Team varun sandesh

A post shared by Varun Sandesh (@itsvarunsandesh) on

ముందుగా మారుతి, అంజలి హౌస్‌లో వెళ్లి అలీ రెెజాను హౌస్‌ బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీకాంత్ హౌస్‌ మేట్స్ కి రూ.10 లక్షల ఆశ చూపెట్టాడు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ రూమ్‌లోకి వెళ్లి మరో రూ.20 లక్షలు తీసుకొచ్చాడు. కానీ ఎవరు టెంప్ట్ కాలేదు. శ్రీకాంత్, కాథరీన్ కలిసి టాప్4లో ఉన్న వరుణ్ సందేశ్‌ను హౌస్ బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు కాస్తంత భావోద్వేగానికి గురయ్యాడు. వరుణ్ సందేశ్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 3లో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ నిలిచారు. ఆ తర్వాత అంజలి హౌస్‌ లోపలి వెళ్లింది. బిగ్‌బాస్ మొదట హౌస్ నుండి స్వచ్ఛందంగా బయటకు వెళ్లే వారికి రూ. 10 లక్షల ఆఫర్ ప్రకటించాడు.

ఆ తర్వాత రూ.25 లక్షలు ప్రకటించాడు. అయినా ఎవరు ఈ ఆఫర్‌కు స్పందించలేదు. ఆ తర్వాత అంజలి బాబా భాస్కర్‌ను హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. చివరగా ఫైనల్‌లో శ్రీముఖి, రాహుల్ నిలిచారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసారు. చిరంజీవికి నాగార్జున పూల బోకే తో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ అనేది ప్రపంచంలో అతిపెద్ద రియాలిటీ షో అని పేర్కొన్నారు. తాజాగా బిగ్‌బాస్ 3 హోస్ట్ అయిన నాగార్జున.. హౌస్‌లో ప్రవేశించి ఫైనల్‌లో నిలిచిన శ్రీముఖి, రాహుల్ ‌ఇద్దరికీ ఒక ఆఫర్ ప్రకటించాడు. ఫైనల్‌గా శ్రీముఖి, రాహుల్‌ను స్టేజ్ మీదికి తీసుకొచ్చి..బిగ్‌బాస్ 3 విజేతగా రాహుల్‌ నిలిచినట్టు నాగార్జున సమక్షంలో చిరంజీవి ప్రకటించారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *