వాతావరణ హెచ్చరికలు.. తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షలు

Related image

అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న తుఫాను.. రాగల 24గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా గాలులు వీస్తాయని.. ఆ కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Image result for rain

రాబోయే 24గంటల్లో తెలంగాణలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏపీలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో బుధ,గురువారాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో 10సెం.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు కేరళ,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కేరళ,ఎర్నాకుళం, త్రిసూర్,మలప్పురం,కోజికోడ్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Image result for rain

ఇదిలా ఉంటే, ఇటీవలి వర్షాలు రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్నాయి. వర్షాల కారణంగా కొన్నిచోట్ల వరిపంట దెబ్బతిన్నది. మరికొన్ని చోట్ల మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *