బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్..  

ప్రతిష్టాత్మక టీం ఇండియా పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టు టీ-20, టెస్ట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అవినీతి కేసులో జరిగిన విచారణలో షకీబ్ తాను తప్పు చేసినట్లు అంగీకరించడంతో ఈ శిక్షను ఖరారు చేసింది. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. ఇందులో ఒక ఏడాదిని సస్పెండ్ చేసింది.

రెండు సంవత్సరాల క్రితం మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఒక బుక్కీ షకీబ్‌ వద్దకు వచ్చాడు.. అయితే నిబంధనల ప్రకారం షకీబ్ ఆ విషయాన్ని ఐసీసీకి చెప్పాలి, కానీ అతను అలా చేయలేదు. ఇటీవల ఐసీసీ అవినీతి నిరోధక భద్రత విభాగానికి ఈ విషయాన్ని అతను చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఐసీసీ అతనిపై విచారణకు ఆదేశించింది. విచారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ అంగీకరించాడు.

ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘‘నేను ఎంతో ప్రేమించే ఆట నుంచి నన్ను నిషేధించడంతో ఎంతో బాధగా ఉంది. కానీ, నేను చేసిన తప్పుని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆటగాళ్లు అవినీతిపై ధీటుగా పోరాటం చేయడానికి ఐసీసీ, ఏసీయూ ఎంతో తోడ్పడతాయి. నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు’’ అని తెలిపాడు.

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *