మహేంద్ర సింగ్ ధోని తర్వాత..ఇన్నాళ్లకు మాక్స్ వెల్ సాధించాడు.. వీడియో వైరల్…

టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఫేవరెట్‌ హెలికాఫ్టర్‌ షాట్‌ను ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ గ్లెన్‌మాక్స్‌ వెల్‌ శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ క్రికెట్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేయడంతో అభిమానులు లైకులు కొడుతున్నారు.

ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం  తొలి టీ20 జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసీస్‌  బ్యాట్స్‌మెన్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (62; 28 బంతుల్లో 7×4, 8×3), డేవిడ్‌ వార్నర్‌(100 నాటౌట్‌; 56 బంతుల్లో 10×4, 4×6) అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక తొమ్మిది వికెట్లకు 99 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆసీస్‌ జట్టు 134 పరుగుల భారీ తేడాతో పొట్టి ఫార్మాట్‌లో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో మాక్స్‌వెల్‌ 44 పరుగుల వద్ద ఉండగా ఫుల్‌టాస్‌ బంతిని సిక్స్‌గా మలిచి అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తర్వాతి బంతిని ధోనీలా హెలికాఫ్టర్‌ షాట్‌ ఆడాడు. దీంతో ఆ బంతి కూడా స్టాండ్స్‌లోకి సిక్స్‌గా దూసుకెళ్లింది.

అల్లు అర్జున్, క్రికెట్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ప్రభాస్, మహేంద్ర సింగ్ ధోని, ట్యాగ్…

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *