జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధానలు దక్కిన అరుదైన గౌరవం..

టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధానలు అరుదైన గౌరవం అందుకోబోతున్నారు. క్రికెట్‌లో నోబెల్ ప్రైజ్‌గా భావించే విజ్డెన్ పురస్కారాలకు భారత్ నుంచి వీరిద్దరూ ఎంపికయ్యారు. బుమ్రా, స్మృతి మంధానలు ‘విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాలకు ఎంపికైనట్టు విజ్డెన్ ఇండియా ప్రకటించింది. పాక్ క్రికెటర్ ఫకర్ జమాన్, శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే, ఆప్ఘాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్‌లు కూడా ఈ ఏడాది విజ్టెన్ పురస్కారం అందుకోనున్నారు.

మొత్తం ఐదుగురికి ఈ పురస్కారాలు లభించగా, వారిలో ఇద్దరు భారతీయులు ఉండడం గమనార్హం. ఇక, దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ బాదిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గురించి విజ్డెన్ ఇండియా మ్యాగజైన్ తాజా ఎడిషన్‌లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, విజ్డెన్ పురస్కారానికి ఎంపికైన మూడో భారత మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన రికార్డులెక్కింది. ఆమె కంటే ముందు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, దీప్తిశర్మ ఈ ఈ పురస్కారాలు అందుకున్నారు.

అల్లు అర్జున్, సమంతా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ట్యాగ్….

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *