కోహ్లీ లేకపోతే అది సాధించటం అంత సాధారణమైన విషయం కాదు : రోహిత్ శర్మ

ఇప్పటివరకు వన్డే ప్లేయర్‌గానే ముద్ర పడిన రోహిత్ శర్మ.. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ అమోఘంగా రాణించాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా అవతారం ఎత్తిన రోహిత్.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 132.25 సగటుతో 529 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి. `మ్యాన్ ఆఫ్ ది సిరీస్`గా నిలిచిన రోహిత్.. తన అద్భుత ప్రదర్శనకు జట్టు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి సహకారం ఎంతో ఉందని చెప్పాడు.
`ప్రపంచంలో ఎక్కడైనా కొత్త బంతిని ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందే. ఈ సిరీస్‌లో నేను కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొన్నాను. శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచగలిగాను. ప్రారంభంలో క్రమశిక్షణతో ఆడాలని, క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ షాట్లు కొట్టాలని అనుకున్నాను. కెప్టెన్, కోచ్, జట్టు యాజమాన్యం మద్దతు వల్లే అద్భుత ప్రదర్శన చేయగలిగా. ఇకపై కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాన`ని రోహిత్ చెప్పాడు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *