సెమీ ఫైనల్లో చిత్తు చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా ! ఫైనల్ కి దూసుకెళ్లిన ఇంగ్లాండ్..ఆసీస్ పై ఘన విజయం!

కీ టాగ్స్: షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, ICC ప్రపంచ కప్, కేన్ విలియమ్సన్, ట్రెంట్ బోల్ట్, మహేంద్ర సింగ్ ధోనీ, ఇంగ్లాండ్ క్రికెట్, ఆస్ట్రేలియా క్రికెట్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ,

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు 223 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఆరు ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి బంతికే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) పరుగులేమి చేయకుండా ఔటవ్వడంతో ఆసీస్ కు మొదటి షాక్ తగిలింది.

ఆ తర్వాత 3వ ఓవర్లో డేవిడ్ వార్నర్ సైతం కేవలం 9 పరుగులకే ఔట్ కావడంతో ఆస్ట్రేలియాకు రెండో షాక్ తగిలింది. క్రిస్ వోక్స్ వేసిన బంతికి బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరిగాడు. ఇక 6 ఓవర్లో ఆసీస్ హ్యాండ్స్ కాంబ్ రూపంలో మూడోవికెట్ కోల్పోయింది.

ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా విధించి 224 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ సునాయసంగా ఛేదించింది. ఓపెనర్లు జేసన్ రాయ్(85), బెయిర్ స్టో(34) తొలి వికెట్ కు 124 పరుగులు సాధించింది అనంతరం జోరూట్, ఇయన్ మోర్గాన్ సైతం రాణించడంతో ఇంగ్లాండ్ ఏకంగా 18 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది.

ఇలా ఆస్ట్రేలియా కేవలం 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అలెక్స్ కేరీ(46), స్టీవ్ స్మిత్ వికెట్ల పతనానికి ఫుల్ స్టాప్ పెట్టి స్కోరు బోర్డును నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే 4వ వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 103 పరుగుల భాగస్వామ్యం జతయ్యింది. ఈ క్రమంలోనే అలెక్స్ కేరీ ఔటవ్వడంతో మరోసారి ఆస్ట్రేలియా వికెట్ల పతనం ఆగలేదు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన మార్కస్ స్టోయినిస్(0) డకౌటై వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా మరోసారి 118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెరిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ మాక్స్‌వెల్ (22) వికెట్లలో కుదురుకునే ప్రయత్నం చేసినప్పటికీ వేగంగా పరుగులు తీసే క్రమంలో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పాట్ కమిన్స్(6) పరుగులకే ఔటయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ స్టీవ్ స్మిత్ మాత్రం నిరాశ చెందకుండా ఒంటరి పోరు చేస్తూ 47 వ ఓవర్లో 85 పరుగులకు రనౌటయ్యాడు. అత్యల్ప స్కోరుకే ఆస్ట్రేలియా నిలిచిపోతుందనుకున్న క్రమంలో స్మిత్ ఒంటరి పోరుతో స్కోరు 200 పరుగులు దాటడం విశేషం.ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓక్స్ 2 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *