చంద్రబాబు నీ అక్రమాల వీడియో చూపిస్తా రాజీనామా చేసి వెళ్ళిపో: వైఎస్ జగన్

కీ ట్యాగ్:- తెలుగు దేశం, చంద్రశేఖర్, చంద్రబాబు నాయుడు, అల్లు అర్జున్, బాలకృష్ణ, త్రిష, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జనసేన, నాని,

వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఉన్నాయి. ఈ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు. ఆ నాటి వీడియోలు అసెంబ్లీలో ప్లే చేస్తూ నాటి హామీలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. రుణమాఫీ చేస్తామని రైతులను గత ప్రభుత్వం మోసం చేసింది. రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ సొమ్మును గత ప్రభుత్వం కట్టకుండా ఆ పథకాన్నే రద్దు చేశారు. కేవలం 24 వేల కోట్ల రుణాలకు కత్తిరించారు. అందులో కూడా రూ.15 వేల కోట్లు కూడా చెల్లించలేదు. ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం రైతులపై రుణభారం రూ.1,49,240 కోట్లకు ఎగబాకింది. రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం నెల రోజుల్లోపే ఏం చర్యలు తీసుకుందన్నది గర్వంగా చెబుతున్నాను.

రాష్ట్రంలో మనసున్న రైతు ప్రభుత్వం అధికారంలో ఉందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది రైతులే ఉన్నారని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూర్తి ప్రసంగం ఇలా..

రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షభావం నేపథ్యంలో మన ప్రభుత్వం ఏం చేస్తామన్నది మొట్ట మొదటి రోజు సభ ముందు ఉంచుతున్నాను. నైరుతి రుతుపవనాలు జూన్‌ 1వ తేదీ నుంచి నిన్నటి వరకు 135.5 మిల్లిమీటర్లు నమోదు కావాల్సి ఉండగా కేవలం 71 మిల్లిమీటర్లు మాత్రమే నమోదు అయ్యింది. సాధారణంగా ఖరీఫ్‌లో 42 లక్షల పంటలు పండుతాయి. ఏటా జూన్‌ నుంచి జులై 10 నాటికి సగటున 9.10 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు వేస్తారు. ఈ ఏడాది కేవలం 3.2 లక్షలహెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. వర్షాలు ఆలస్యమయ్యాయి. గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వీటిని అన్నింటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా ఈ సభలో ఉంచుతున్నాను. మేం అ«ధికారంలోకి వచ్చి కేవలం 45 రోజులు మాత్రమే. అయినా సరే ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఈ సభలో చాలా మందికి ఈ విషయాలు గుర్తు ఉండే ఉంటాయి. 2013–2014లో ఒక వైపు తీవ్రమైన కరువు, మరోవైపు తుపాన్లతో రాష్ట్రం అల్లకొల్లలమైంది.

ఆధికారంలోకి వచ్చిన టీడీపీ ఆదుకుంటామని మాటి ఇచ్చి..రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. గత ప్రభుత్వం దారుణమైన మోసాలు ఎలా చేశారో అందరం చూశాం. గత ప్రభుత్వ హయాంలో గడిచిన ఐదేళ్లలో తీవ్రమైన కరువు చూశాం. గతేడాది తీవ్రమైన కరువును చూశాం. ఒక్క ఖరీఫ్‌లోనే గతేడాది అక్షరాల 1838 వేల కోట్ల నిధులు కరువును ఎదుర్కొనేందుకు అవసరమైని గత ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అవసరమని చెప్పారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా డబ్బులు వచ్చాయి.

పంట నష్టపోయిన రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపన పోలేదు. గత ప్రభుత్వం ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా చేయలేదు. ఎప్పుడు ఇవ్వాలన్నది కాస్త అవగాహన వచ్చేలా చెబుతాను. ఈ సంవత్సరం జూన్‌లో విత్తనాలు వేయాలంటే దాని అర్థం ఖరీఫ్‌ ప్రారంభమైందని అర్థం. ఏప్రిల్‌ నాటికి విత్తనాల సేకరణ పూర్తి అయి, మే నెలలో విత్తనాలు పంపిణీ చేయాలి. మేం అధికారంలోకి వచ్చే నాటికి విత్తనాల పంపిణీ జరగాలి. అలా జరుగకపోవడంతో రైతులు రోడ్డుపైకి వచ్చారు.

మేం బాధ్యతలు స్వీకరించిన నాటికి 4.1 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది. తీరా చూస్తే కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మేం అధికారులను అడిగితే వారు లేఖను చూపించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ నుంచి నిధులు విడుదల చేయలేదని అధికారులు లేఖ రాశారు. నిధుల కోసం ఎన్నిమార్లు అధికారులు లేఖలు రాసినా గత ప్రభుత్వం స్పందించలేదు. చేయాల్సిన పని సకాలంలో చేయలేకపోయారు. మేం ఏం చేయాలేకపోయామని అధికారులు చెబుతుంటే బాధనిపించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.960 కోట్లు బకాయిలు పెట్టారు. అక్షరాల రూ.384 కోట్లు విత్తన బకాయిలు ఉన్నాయి. అవి కూడా  ఇవ్వని పరిస్థితి ఉంది. రైతుల జీవితాలతో ఆడుకున్నారని అధికారులే చెబుతున్నారు. కరువు సంవత్సరాల్లో కనీసం వడ్డీ చెల్లింపులు చేయలేకపోయారు. రుణాల రీషెడ్యూల్‌కు ఏ ప్రభుత్వమైనా ముందుకు రావాలి. గతంలో ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా రాలేదు. తీవ్ర కరువులో ఉన్న ఎలాంటి రీ షెడ్యూల్‌ రుణాలు లేవు. మొన్న ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో అధికారులు చెప్పింది చూస్తే బా«ధనిపించింది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *