విద్యార్థులకు శుభవార్త!ప్రభుత్వం కొత్త రూల్.. ఇకపై పరీక్షల్లో పాస్ అవ్వాలంటే అది చేస్తే చాలు!

ఈ కొత్త రూల్ ఇండియాలో కాదండోయ్.. ఫిలిప్పిన్స్‌లో. హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతి విద్యార్థి కనీసం 10 మొక్కలు నాటాలంటూ అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ ప్రవేశపెట్టింది.ఇకపై పరీక్షల్లో పాస్ కావాలన్నా, గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్ పొందాలన్నా విద్యార్థులు ఇకపై తప్పకుండా పదేసి మొక్కలు నాటాలి. లేకపోతే.. పరీక్షల్లో ఉత్తీర్ణులైనా.. ఫెయిలైనట్లే లెక్క.

గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ప్రతి విద్యార్థికి పర్యావరణపై అవగాహన కల్పించాలని, వారు బాధ్యతగా పదేసి మొక్కలు నాటితేనే పాసైనట్లుగా గుర్తిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ‘గ్రాడ్యూయేషన్ లేజసీ ఫర్ ది ఎన్విరాన్మెంట్’ చట్టానికి మే 15న శాసన సభ్యులు ఆమోదం తెలిపారు.

ఈ సందర్భంగా మాగ్దా పార్టీ ప్రతినిధి గ్యారే అలెజనో మాట్లాడుతూ.. ‘‘ఎలిమెంట్రీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఏటా 12 మిలియన్ మంది ఉత్తీర్ణులవుతున్నారు. వీరంతా పదేసి మొక్కలను నాటినట్లయితే ఏడాది 175 మిలియన్ మొక్కలతో దేశంలో పచ్చదనం నెలకొంటుంది’’ అని తెలిపారు. బాగుంది కదా ఐడియా! అడవులు, పంటపొలాలు అంతరించిపోయి.. కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న మన దేశంలో కూడా ఇలాంటి చట్టం అందుబాటులోకి వస్తే.. పర్యావరణానికి మేలు జరుగుతుంది కదూ!!

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *