వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు అరుదైన గౌరవం ఇచ్చిన ఎయిర్‌ఫోర్స్!!

మిగ్ కంటే అన్ని విధాల మెరుగైన ఎఫ్-16ను అభినందన్ కూల్చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అభినందన్ మిగ్-21 బైసన్ స్క్వాడ్రన్‌కు ఫాల్కన్ స్లేయర్స్ (సంహరించినవాడు), అమ్రామ్ (ఏఎంఆర్ఏఏఎం) డాడ్జర్స్ ప్యాచ్‌లను ఎయిర్‌ఫోర్స్ ఇచ్చింది.

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన గౌరవం ఇచ్చింది. పాత మిగ్-21 బైసన్ యుద్ధ విమానంలో పాకిస్థాన్‌కు చెందిన ఆధునిక ఎఫ్-16 జెట్‌ను వెంబడించిన అభినందన్.. దాన్ని కూల్చేసిన సంగతి తెలిసిందే.

అభినందన్ ధైర్య సాహసాలకు గుర్తుగా ఎయిర్‌ఫోర్స్ 51 స్క్వాడ్రన్ మిగ్-21 బైసన్‌తో కూడిన షోల్డర్ ప్యాచ్‌ను రూపొందించింది. ఇందులో మిగ్-21 ముందు భాగంలో కనిపిస్తుండగా.. ఎఫ్-16ను అటాక్‌కు గురైనట్టుగా బ్యాక్‌గ్రౌండ్లో ఉంచారు.

సుఖోయ్-30 స్క్వాడ్రన్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎఫ్-16 జారవిడిచిన అమ్రామ్ క్షిపణుల నుంచి తప్పించుకుంది. దీనికి గుర్తుగా భుజానికి ఉండే ప్యాచ్‌లపై అమ్రామ్ డోడ్జర్స్‌ అనే అక్షరాలను ఉంచింది.

బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాక్ ఎయిర్‌ఫోర్స్ భారత్‌పై దాడులకు ప్రయత్నించగా.. ఐఏఎఫ్ తిప్పికొట్టింది. ఈ క్రమంలో పాక్ ఫైటర్ జెట్లను తరిమిన అభినందన్ ఎఫ్-16ను కూల్చేశాడు. తను ప్రయాణించిన మిగ్-21 కూడా కూలిపోవడంతో.. పారాచ్యూట్ సాయంతో పాక్‌ భూభాగంలో దిగిన అభినందన్‌ను పాక్ సైన్యం బంధించింది.

మార్చి 1న సాయంత్రం ఆయన్ను వదిలిపెట్టింది. భారత్ తిరిగొచ్చిన అభినందన్‌కు ఢిల్లీలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం భద్రతా కారణాలతో ఆయన్ను జమ్మూ కశ్మీర్ నుంచి మరో చోటుకి బదిలీ చేశారు.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *