2019సార్వత్రిక ఎన్నిలకలో ఈసీ సంచలన నిర్ణయం.. చరిత్రలో తొలిసారి..

బెంగాల్‌లో గడువు కంటే ఒకరోజు ముందే ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీచేసింది. బెంగాల్‌లోని మొత్తం 9 నియోజకవర్గాల్లో గురువారం రాత్రి 10 వరకు ప్రచారానికి అనుమతిస్తూ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. భారత దేశ ఎన్నిలక చరిత్రలో తొలిసారిగా ఆర్టికల్ 321ను ప్రయోగించింది.ఎన్టీఆర్, తెలుగు దేశం, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, జనసేన, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు.

తుదివిడత ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లో ఘర్షణలు తలెత్తాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. అటు రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఘర్షణపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం…బెంగాల్ ఎన్నికల ప్రచారంపై సంచలన నిర్ణయం తీసుకుంది.

మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీ సందర్భంగా కోల్‌కతాలో హింస చెలరేగింది. అమిత్ షా వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లు విసరడంతో ఘర్షణ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ యూత్ వింగ్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే టీఎంసీ కార్యకర్తలను బీజేపీ యూత్ నేతలు తరిమికొట్టారు. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాసాగర్ కాలేజీ దగ్గర పలు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. కాలేజీ సమీపంలో ఉన్న ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేశారు.

కోల్‌కతాలో చెలరేగిన హింసాత్మక ఘటనలపై బీజేపీ, టీఎంసీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ కార్యకర్తలు వాహనాలకు నిప్పుపెట్టారని, విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం చేశారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలు పలు వీడియోలను బయటపెట్టారు. వాటిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. టీఎంసీ గూండాలను అల్లర్లకు పాల్పడ్డారని ఎదురుదాడికి దిగారు.

బెంగాల్ ఘటనలను నిరసిస్తూ ఢిల్లీలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు ధర్నాలు సైతం చేశారు. మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో ఆకస్మిక పాదయాత్ర చేపట్టారు. కోల్‌కతా వీధుల్లో మార్చ్ నిర్వహించడంతో భద్రతను పటిష్టం చేశారు పోలీసులు. ఈ పరిణిమాలన్నింటినీ పరిశీలించిన ఎన్నికల సంఘం.. ప్రచారాన్ని ఒక రోజు ముందే ముగించాలని పార్టీలను ఆదేశించింది.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *