వైసీపీ వర్గాల కీలక సమాచారం.. జగన్ కేబినెట్‌లో మంత్రి ఆయనే..!షాక్ లో చంద్రబాబు

వైసీపీ నుంచి ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బరిలో ఉన్నారు. పలుసార్లు మంత్రిగా పని చేసిన ధర్మాన గెలిస్తే… మరోసారి ఆయన జగన్ కేబినెట్‌లో అమాత్యుడు కావడం ఖాయమనే ప్రచారం ఉంది. ధర్మాన అనుభవాన్ని జగన్ వదులుకోరని ఆయన అనుచరులు గట్టిగా నమ్ముతున్నారు.ఎన్టీఆర్, తెలుగు దేశం, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణ, జనసేన, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు.

వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే అంశంపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే దానిపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోయేది ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.

అయితే ఈ విషయంలో జగన్ ఆలోచన మరోలా ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావుకు బదులుగా ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ను జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

తన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చిన ధర్మాన కృష్ణదాస్‌కు ఈ విషయంలో జగన్ నుంచి స్పష్టమైన హామీ కూడా లభించిందని శ్రీకాకుళం వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే కృష్ణదాస్ నో అంటే మరోసారి మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు టీడీపీ హయాంలో ఒకసారి మంత్రిగా వ్యవహరించి వైసీపీలో చేరిన తమ్మినేని సీతారాం కూడా జగన్ కేబినెట్‌లో బెర్త్ కోసం పోటీ పడుతున్నారని సమాచారం. ఈ సారి తన గెలుపు ఖాయమని నమ్మకంగా ఉన్న ఆయన… అదృష్టం కలిసొస్తే మరోసారి తనకు అమాత్యపదవి దక్కుతుందని భావిస్తున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ కేబినెట్‌లో ధర్మాన బ్రదర్స్‌లో ఎవరికి ఛాన్స్ ఉంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *