ఎన్టీఆర్‌ తో గొడవ పై రాజీవ్ కనకాల ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు!

చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, నాని, త్రిష, కాజల్ అగర్వాల్, సమంతా, తమన్నా, వీళ్లందరికి ఎన్టీఆర్‌, రాజీవ్ కనకాల బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. రాజీవ్ కనకాల – జూనియర్ ఎన్టీఆర్‌ లు మంచి ఫ్రెండ్స్ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

 

ఇద్దరూ కలిసి స్టూడెంట్ నెంబర్ 1, జనతాగ్యారేజ్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాల్లో కలిసి పనిచేయడమే కాకుండా.. 2009లో టీడీపీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించగా.. ఆయన వెంటఉన్నారు రాజీవ్ కనకాల.

అదే ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కారు ప్రమాద ఘటనలో ఎన్టీఆర్‌తో పాటు రాజీవ్ కనకాల కూడా గాయాలపాలయ్యారు.

అయితే అశోక్ సినిమా తరువాత ఎన్టీఆర్- రాజీవ్ కనకాల మధ్య స్నేహం చెడిందని.. మళ్లీ జనతా గ్యారేజ్ చిత్రంతో స్నేహం చిగురించిందంటూ పుకార్లు షికారు చేశాయి. వీటిపై రాజీవ్ కనకాల స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పడూ ఎవర్నీ దూరం చేసుకోను. వాళ్లు దూరం అవ్వాలనుకుంటే నేను ఆపలేను. అది వాళ్ల ఛాయిస్. అయితే ఎన్టీఆర్‌తో నాకు స్నేహం చెడిందని రకరకాల వార్తలు పుట్టించారు.

అసలు ఎన్టీఆర్‌కి నాకు మధ్య గ్యాప్ ఎప్పుడూ లేదు. అదే నిజమైతే మళ్లీ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలు ఎందుకు చేస్తా.

ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమాలోనూ నేను నటించాలంటే ఎలా కుదురుతుంది. అది దర్శకుడి ఇష్టం. నేను సూట్ అయ్యే పాత్ర అందులో ఉండాలి. ప్రతి సినిమాలోనూ కనిపిస్తే.. చూసేవాళ్లకు కూడా నచ్చదు. ప్రతి సినిమాలోనూ నేను నటించాలనే రూల్ లేదు.


వాస్తవానికి ఎన్టీఆర్ నాకంటే చాలా చిన్న వయసు. చాలా ఓపెన్‌గా ఉంటాడు. స్టూడెంట్ నెం.1 టైంలోనే చెప్పా. అప్పుడు మమ్మల్ని మరిచిపోకూడదన్నా. నిన్ను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు.

అప్పటి నుండి ఇప్పటి వరకూ బాండింగ్ అలాగే ఉంది. అయితే బిజీ లైఫ్‌తో పాటు పెళ్లి, పిల్లలు, ఇలాంటి వాటి వల్ల ఇంతకు ముందులా కలవలేకపోతున్నాం. మా ఫ్రెండ్ షిప్ ఎప్పిటికీ ఇలాగే ఉంటుంది.

ఇక నేను హీరోల ఛాయిస్ అనే వార్తల్లో కూడా నిజం లేదు. ఒక సలహాగా దర్శకుడికి నా పేరు చెప్తారేమో కాని ప్రత్యేకించి నేనే చేయాలని బలవంతం చేయరు. కథను బట్టే నా పాత్ర ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల.

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *